నేడు టాలీవుడ్‌లోని స్టార్ రైటర్స్‌లో వక్కంతం వంశీ ఒకరు. ఆయనకు ఎప్పటినుండో దర్శకునిగా ఛాన్స్ ఇస్తానని ఎన్టీఆర్ చెబుతూనే ఉన్నాడు. కానీ ఆయన మాట మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. కాగా త్వరలో ఎన్టీఆర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించనున్నాడు. అది కూడా తన అన్న కళ్యాణ్‌రామ్‌తో కలిసి చేసే మల్టీస్టారర్ ఫిల్మ్‌తో అని సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై వంశీ కసరత్తు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్వయంగా నందమూరి కళ్యాణ్‌రామ్ తానే నిర్మాతగా తన ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.