తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘బాహుబలి’ చిత్రంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ కూడా థియేటర్లలో హల్‌చల్ చేస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో జూలై 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు రాజమౌళి ఇంతకుముందే ఎనౌన్స్ చేశాడు. అయితే అతను చెప్పిన టైమ్‌కి చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం, కొంత గ్రాఫిక్ వర్క్ కూడా మిగిలి వుండడం వల్ల చెప్పిన డేట్‌కి రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్న కరన్ జోహార్ మాత్రం జూలై 10న చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని పట్టుపడుతున్నాడట. అందులో భాగంగానే ట్రైలర్ రిలీజ్‌కి ఏర్పాటు చేసిన వినైల్స్‌లో డేట్ వేసేశాడు. అలా రాజమౌళిని జూలై 10కే సినిమాని రిలీజ్ చేసేలా కమిట్ చేస్తున్నాడు. దీంతో రాజమౌళికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదట. కొంత వర్క్ బ్యాలెన్స్ వుందని చెప్పినా, దాన్ని సెకండ్ పార్ట్‌లో చూసుకోమని సలహా కూడా ఇస్తున్నాడట. ఇందులో నిజానిజాలు ఎంత వున్నాయో తెలీదు గానీ రాజమౌళి మాత్రం జూలై 10కి సినిమాని రిలీజ్ చెయ్యడానికి సిద్ధంగా లేడన్న వార్త ప్రచారంలో వుంది.