Advertisementt

28 ఏళ్ల తర్వాత ఆయనతో కమల్‌..!!

Thu 04th Jun 2015 12:37 PM
kamal hassan,mani rathnam,nayakudu,new film  28 ఏళ్ల తర్వాత ఆయనతో కమల్‌..!!
28 ఏళ్ల తర్వాత ఆయనతో కమల్‌..!!
Advertisement
Ads by CJ

'నాయకుడు' కమల్‌ కెరియర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం. ఓ సమయంలో ఈ చిత్రానికి తప్పకుండా ఆస్కార్‌ అవార్డు వస్తుందని కూడా కమల్‌ భావించారు. కమల్‌కు అంతటి ఘన విజయాన్ని అందించిన మణిరత్నం ఆ తర్వాత ఆయనతో మరో సినిమా చేయలేదు. ఈ సినిమా వచ్చి దాదాపు 30 ఏళ్లు అవుతున్నప్పటికీ మళ్లీవారిద్దరి కాంబినేషన్‌ రిపీట్‌ కాకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.

అయితే తాను మణిరత్నం డైరెక్షన్‌లో త్వరలో నటించే అవకశాలు ఉన్నాయని కమల్‌ ప్రకటించాడు. తాను, మణిరత్నం మరోసారి ఓ సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చామని, ఇప్పుడు మణి ఆ పనిపైనే ఉన్నట్లు కమల్‌ ప్రకటించాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందించే అవకాశం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'నాయకుడు' మూవీ టైమ్‌ మ్యాగజైన్‌ ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ మూవీస్‌-100లో స్థానం సంపాదించుకుంది. మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ