‘నాయకుడు’.. భారత చలన చిత్ర పరిశ్రమలో మరపురాని మరిచిపోలేని ఓ కళాఖండం. మణిరత్నం`కమల్‌హాసన్‌ల కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని ఎవ్వరూ ఎప్పటికీ మరిచిపోలేరు. కాగా దీనికి సీక్వెల్ చేయాలని ఉందని కమల్‌హాసన్ తన మనసులోని మాటను వెల్లడిరచాడు. నేను ఎక్కడికి వెళ్లినా మరలా ‘నాయకుడు’లాంటి చిత్రాన్ని ఎప్పుడు చేస్తారు? అని అందరూ అడుగుతున్నారు. ఈ చిత్రం నాపైనే కాదు.. ప్రేక్షకులందరి మీద చెరగని ముద్ర వేసి అందరిపై తీవ్ర ప్రభావం చూపింది. మరలా అలాంటి శక్తివంతమైన స్టోరీ లభిస్తే నేను, మణిరత్నం ఇద్దరం కలిసి పనిచేస్తాం. త్వరలోనే అది పట్టాలెక్కుతుందని భావిస్తున్నాను.. అంటున్నాడు లోకనాయకుడు.