Advertisementt

కింగ్‌ను మరోసారి డైరెక్ట్‌ చేయనున్న లారెన్స్‌..!!

Mon 08th Jun 2015 07:04 AM
lawrence,nagarjuna,new film,kanchana  కింగ్‌ను మరోసారి డైరెక్ట్‌  చేయనున్న లారెన్స్‌..!!
కింగ్‌ను మరోసారి డైరెక్ట్‌ చేయనున్న లారెన్స్‌..!!
Advertisement
Ads by CJ

నృత్య దర్శకుడిగా చాలా బిజీగా ఉన్న సమయంలోనే లారెన్స్‌ డైరెక్షన్‌ వైపు కన్నేశాడు. ఆయన ప్రతిభపై నమ్మకముంచిన నాగార్జున దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారు. ఆ చిత్రం తెలుగునాట 'మాస్‌'గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఆ తర్వాత మరోసారి లారెన్స్‌ కింగ్‌ నాగార్జునతో 'డాన్‌' తీసినా అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఇక మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంచన-2 హిట్‌తో మంచి ఊపుమీదున్న లారెన్స్‌ తన తదుపరిచిత్రాన్ని నాగార్జునతో తీయనున్నట్లు చర్చలు కొనసాగుతున్నాయి.

ముని, కాంచన, కాంచన-2 అంటూ భయపెట్టే సినిమాలతో లారెన్స్‌ అటు తమిళ్‌ ఇటు తెలుగులో కూడా సంచలన విజయాలను నమోదు చేసుకున్నాడు. కాంచన-2 విడుదలై పెద్ద విజయాన్ని సాధించడంతో ఇక తన తదుపరి చిత్రంపై లారెన్స్‌ దృష్టి కేంద్రీకరించాడు. ఈ మేరకు నాగార్జునను కలిసి స్టోరీ కూడా వినిపించాడని, కింగ్‌ కూడా సినిమాకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. దీంతోనే త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టడానికి లారెన్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ