Advertisementt

సంపూని నమ్ముకుంటే కోట్లు కొల్లగొట్టవచ్చు..!

Thu 11th Jun 2015 05:24 AM
sampoornesh babu,hrudaya kaleyam,singam 123,allari naresh  సంపూని నమ్ముకుంటే కోట్లు కొల్లగొట్టవచ్చు..!
సంపూని నమ్ముకుంటే కోట్లు కొల్లగొట్టవచ్చు..!
Advertisement
Ads by CJ

‘హృదయకాలేయం’ చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు. మంచు మనోజ్‌, అల్లరినరేష్‌ వంటి హీరోలు కూడా తమ సినిమాల్లో సంపూకు ఏదో ఒక క్యారెక్టర్‌ ఇచ్చి అతనికి హైప్‌ను పెంచారు. తాజాగా సంపూ హీరోగా నటించిన ‘సింగం123’ విడుదలైంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిచండంతో అంచనాలు బాగానే పెరిగాయి. కాగా ఈ చిత్రాన్ని ఇటీవలే గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. థియేటర్లతో పాటు ఆన్‌లైన్‌లోనూ రిలీజ్‌ చేశారు. కోటి రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మించిన మంచు విష్ణు వివిద ఏరియాలన్నీ కలిపి రెట్టింపు లాభాన్ని పొందాడట. థియేట్రికల్‌ రైట్స్‌, ఇతర రైట్స్‌ అన్నీ కలిపి ఈ చిత్రానికి 4కోట్లు ఆదాయం వచ్చిందని సమాచారం. మరి కోటికి నాలుగు కోట్లు అంటే సామాన్యమా...?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ