శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్నన చిత్రంలో చరణ్ స్టంట్ మాస్టర్ పాత్ర చేయనున్నాడని ఎంతో కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్ స్టిల్స్‌లో రామ్‌చరణ్ ఖాకీడ్రస్‌లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. దీంతో అందరిలోనూ సందిగ్దం నెలకొంది. మరి ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ది స్టంట్ మాస్టర్ పాత్రా? లేక పోలీస్ ఆఫీసర్ పాత్రా? అనే కన్‌ఫ్యూజన్ మొదలైంది. అదే చరణ్ ఈ చిత్రంలో నటించేది పోలీస్ ఆఫీసర్ పాత్ర అయితే చరణ్ నటిస్తున్న రెండో ఖాకీ చిత్రం ఇదే కానుంది. గతంలో రామ్‌చరణ్ ‘జంజీర్’ (తుఫాన్)లో పోలీస్‌పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.