Advertisementt

మహేష్‌కు రవితేజకు సామాజిక బాధ్యత లేదా...?

Sat 13th Jun 2015 08:29 AM
mahesh babu,raviteja,kick2,bengal tiger,adds  మహేష్‌కు రవితేజకు సామాజిక బాధ్యత లేదా...?
మహేష్‌కు రవితేజకు సామాజిక బాధ్యత లేదా...?
Advertisement
Ads by CJ

మాస్‌మహారాజా రవితేజ దాదాపు 50ఏళ్లకు చేరువ అవుతున్నాడు. దీంతో ఆయన తన భవిష్యత్తును ఊహించుకొని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.తను ఫామ్‌లో ఉండగానే నాలుగు రాళ్లు కాదు..కాదు.. నలభై రాళ్లు వెనకేసుకోవడానికి సిద్దమవుతున్నాడు. దీంతో ఆయన రూట్‌ మార్చాడు. ఫ్యూచర్‌ ప్లానింగ్‌ చేస్తూ సినిమాలే కాదు... అవకాశాలు వస్తే యాడ్స్‌లో కూడా నటించడానికి ఓకే చెబుతున్నాడు. తాజాగా ఆయన ఓ లిక్కర్‌ బ్రాండ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘కిక్‌2’, ‘బెంగాల్‌టైగర్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో మరో రెండు చిత్రాలను ప్రారంభించనున్నాడు. సినిమా అంటే నెలల తరబడి పనిచేయాలి. అదే యాడ్స్‌లో నటిస్తే తనకు వచ్చే పారితోషికంలో ఎలాంటి తక్కువ లేనప్పటికీ రెండు మూడు రోజులు కష్టపడితే చాలు.  అందుకే ఇంతకు ముందు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన ఈయన ఇకనుండి ఏడాదికి కేవలం రెండు చిత్రాలకే పరిమితం కానున్నాడు. ఆయన ఇప్పటికే లూనార్‌ షూ కంపెనీకి ఎండార్స్‌మెంట్‌ చేశాడు. నెల తిరక్కుండానే ఈ లిక్కర్‌ యాడ్‌ను లైన్లో పెట్టాడు. మహేష్‌ తర్వాత లిక్కర్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేసిన ఘనత రవితేజకే దక్కుతుంది మరి... ! తనకి కావాల్సింది డబ్బులైనప్పుడు లిక్కక్‌ బ్రాండ్‌కే కాదు.. దేనికైనా ఎండార్స్‌ చేయగల హీరోలుగా మహేష్‌, రవితేజలు నిలుస్తారని చెప్పడానికి ఇదే ఉదాహరణ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ