Advertisementt

మెగాహీరో సినిమాకు డైరెక్టర్‌ దొరికాడు...!

Sat 13th Jun 2015 09:32 AM
sai dharam tej,subrahmanyam for sale,vegnesa satish  మెగాహీరో సినిమాకు డైరెక్టర్‌ దొరికాడు...!
మెగాహీరో సినిమాకు డైరెక్టర్‌ దొరికాడు...!
Advertisement
Ads by CJ
ప్రస్తుతం ప్రముఖ నిర్మాత దిల్‌రాజు హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజతో ‘సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దిల్‌రాజు బేనర్‌లో ‘పిల్లా... నువ్వులేని జీవితం’ చిత్రంలో నటించిన సాయితో దిల్‌రాజు మరో సినిమా ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శతమానం భవతి’ అనే టైటిల్‌ను అనుకొంటున్నారు. కాగా ఈ చిత్రానికి ‘గబ్బర్‌సింగ్‌, రామయ్యా వస్తావయ్యా’ సినిమాలకు స్క్రీన్‌ప్లే సహకారం అందించి ప్రస్తుతం ‘సుబ్రమణ్యంఫర్‌ సేల్‌’కు కూడా రచయితగా పనిచేస్తున్న వేగ్నేశ సతీష్‌ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. మరి ఇప్పటికే దర్శకునిగా ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న సతీష్‌కు ఈ చిత్రం టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ