మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకు పూరీని దర్శకునిగా తొలగించాలని మెగాక్యాంప్ భావిస్తోందని, గత రెండురోజులుగా ఈ చిత్రం విషయంలో వినాయక్‌తో చిరు మంతనాలు జరుపుతున్నాడని సమాచారం. అయితే ఇటీవల డైరెక్టర్ పూరీ ప్రొడక్షన్ పనులు కూడా తనకు వదిలేయాలని చిరును కోరాడట. రామ్‌చరణ్, చిరంజీవి ఇద్దరికీ ప్రొడ్‌క్షన్ విషయంలో పెద్దగా అనుభవం లేకపోవడం.. ఇప్పటివరకు అన్ని విషయాలను అల్లుఅరవింద్ చూసుకుంటూ ఉండటంతో అరవింద్‌తో పడకపోవడంతో పూరీ ఈ ప్రతిపాదన చేశాడని తెలుస్తోంది. మెగాస్టార్ రెమ్యూనరేషన్ మినహా కొంత బడ్జెట్ అనుకుని, ఆ మొత్తాన్ని తనకిస్తే సినిమా మొత్తం తీసి ఫస్ట్‌కాపీ చిరు చేతిలో పెడతానని పూరీ చెప్పాడని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన చిరుకు నచ్చకపోవడంతో పాటు పూరీపై గుర్రుగా ఉన్నాడని తెలుస్తోంది.