Advertisementt

మరీ ఇంత చీప్‌గానా..!

Tue 16th Jun 2015 11:22 AM
teja,horahori movie,hero heroin remuneration  మరీ ఇంత చీప్‌గానా..!
మరీ ఇంత చీప్‌గానా..!
Advertisement
Ads by CJ

దర్శకుడు తేజది డిఫరెంట్‌ స్కూల్‌. సినిమాను తక్కువ పెట్టుబడితో అదీ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కాకుండా అంతా కొత్తవాళ్లతో తీసే సత్తా ఆయనకు ఉంది. కానీ ఆయనకు మంచి విజయం లభించి చాలాకాలం అయింది. ప్రస్తుతం ఆయన ‘హోరాహోరి’ అనే చిత్రాన్ని తీస్తున్నాడు. ఇందులో కూడా కొత్త హీరో హీరోయిన్లు నటిస్తున్నారు. సినిమా ఓపెనింగ్స్‌కు తన బ్రాండ్‌ పనిచేస్తుందని భావిస్తున్న ఆయనకు ఇలాంటి చిత్రాలు హిట్టయితే బోలెడు పేరుతో పాటు డబ్బులు కూడా పుష్కళంగానే వస్తాయి. హీరోహీరోయిన్లు కొత్తవారు కనుక వారికి పెద్దగా పారితోషికాలు ఇవ్వాల్సిన పనిలేదు. అయినా అసలు ఇవ్వకపోతే బాగుండదని భావించిన తేజ ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్‌కు లక్ష రూపాయలు ఇచ్చాడట. హీరోకైతే మరీ తక్కువగా అంటే 11వేల 111రూపాయలు ఇచ్చాడట. మరి ఈ సినిమా విడుదలై హిట్టయితే అందరికీ పండగే అని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ