బొద్దుగుమ్మ నమిత అంటే తమిళ తంబీలకు పెద్ద పిచ్చి. మరీ బొద్దుగా తయారైన ఈ అమ్మడుకు ఇప్పటికీ కూడా అక్కడ భారీ ఫ్యాన్స్ ఉన్నారు. కాగా ఆమెకు ఈమధ్య హీరోయిన్ అవకాశాలు అస్సలు రాకుండా పోయాయి. దాంతో ఆమె ఇప్పటివరకు తాను సంపాదించిన సొమ్ముతో ఓ కొత్త వ్యాపారం చేయడానికి రెడీ అవుతోంది. అదే రెస్టారెంట్ల వ్యాపారం. మొదటగా చెన్నైలో ఓ రెస్టారెంట్‌ను నెలకొల్పి, వ్యాపారంలో పేరొస్తే అన్ని ముఖ్య ప్రదేశాలలోనూ బ్రాంచ్‌లు తెరవాలని ఆమె ప్లానింగ్. కాగా ఆమె కుటుంబ సభ్యులు మాత్రం నగల వ్యాపారం చేద్దామని ఆమెపై ఒత్తిడి తెస్తున్నారట. ఎందుకంటే ఆమె కుటుంబీకులకు నగల వ్యాపారంలో చాలా అనుభవం ఉంది. మరి ఇంతకీ నమిత ఏ వ్యాపారం వైపు మొగ్గుచూపుతుందో వేచిచూడాల్సివుంది....!