మహేష్‌బాబు... ట్విట్టర్‌లో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న తెలుగు స్టార్ హీరో. ఆయన ట్వీట్ చేశాడంటే ఏదో ఒక విశేషం ఉంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాలకు సంబంధించిన ట్వీట్లు, లేదా అభిమానుల గురించి చెప్పే మాటలు లేదా ఆయన పర్సనల్ విషయాలకు సంబంధించిన విషయాలు తప్ప అనవసర విషయాలు చెప్పడం మహేష్‌బాబుకు అలవాటు లేదు. మహేష్ ఎన్నో కార్పొరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేస్తున్నా..... ఇప్పటివరకు వాటి నీడ తన ట్విట్టర్ అకౌంట్ మీద పడనీయలేదు. కానీ మహేష్ తొలిసారిగా ట్విట్టర్‌లో తన వ్యాపార ప్రకటన దర్శనమిచ్చింది. చాలా ఎగ్జైట్ అయ్యానంటూ మహేష్ పేర్కొన్నాడు. అయినా అందులో అంతగా ఎగ్జైట్ అయ్యే విషయం ఏముందని? అని అభిమానులు, వీక్షకులు నిట్టూరుస్తున్నారు. బహుశా ఆయన ట్విట్టర్ నుండి ఇలాంటి ట్వీట్ ఎవ్వరూ ఊహించి ఉండరేమో...!