Advertisementt

ఆ సినిమాలో రెండు పులులు వున్నాయట.!

Thu 18th Jun 2015 02:55 AM
tamil hero vijay,vijay new movie puli,vijay dual role in puli,director chimbu devan,puli first look on june 22nd  ఆ సినిమాలో రెండు పులులు వున్నాయట.!
ఆ సినిమాలో రెండు పులులు వున్నాయట.!
Advertisement
Ads by CJ

విజయ్‌ హీరోగా శింబుదేవన్‌ దర్శకత్వంలో శిబు, పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘పులి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ టోటల్‌గా కంప్లీట్‌ అయింది. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో భారీ తారాగాణం నటించింది. చాలా గ్యాప్‌ తర్వాత శ్రీదేవి ఒక సౌత్‌ సినిమాలో నటించింది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని జూన్‌ 22న విడుదల చేయబోతున్నారు. చిత్రాన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 17న రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. అయితే ఆ డేట్‌కి రిలీజ్‌ కాకపోవచ్చని సమాచారం. 

ఇదిలా వుండగా, ఈ సినిమాకి సంబంధించి మరో కొత్త విషయం బయటికి వచ్చింది. ఈ చిత్రంలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, రెండో క్యారెక్టర్‌ గురించి కావాలనే ఇప్పటి వరకు బయట పెట్టలేదని తెలుస్తోంది. ఇది ఒక ఫాంటసీ మూవీ కావడంవల్ల థ్రిల్‌ మిస్‌ అవుతుందన్న ఉద్దేశంతోనే రెండో క్యారెక్టర్‌ గురించి ఇప్పటి వరకు ప్రస్తావన తీసుకు రాలేదు. అయితే విజయ్‌ రెండు క్యారెక్టర్లు చేస్తున్నాడని తెలిసిన తర్వాత సినిమా మీద క్రేజ్‌ పెరిగిందట. ముఖ్యంగా విజయ్‌కి తమిళ్‌లో ఎంత ఫాన్‌ ఫాలోయింగ్‌ వుందో తెలిసిందే. ఈ సినిమా మీద విజయ్‌ ఫాన్స్‌ చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వున్నారు. తెలుగులో విజయ్‌కి అంత ఫాలోయింగ్‌ లేదు. బిజినెస్‌పరంగా కూడా అంత స్పీడ్‌ వుండదు. ఈ సినిమాతో దాన్ని బ్రేక్‌ చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ