Advertisementt

సంపూతో పోటీపడుతోన్న మెగాహీరోలు!

Fri 19th Jun 2015 05:59 AM
sampoornesh babu,siima awards,mega heroes,sai dharam tej,varun tej  సంపూతో పోటీపడుతోన్న మెగాహీరోలు!
సంపూతో పోటీపడుతోన్న మెగాహీరోలు!
Advertisement
Ads by CJ

ఆఖరికి మెగా హీరోల పరిస్థితి సంపూతో పోటీపడే స్థాయికి వచ్చేసింది. అయితే ఇది బాక్సాఫీస్‌ వద్ద కాదు. సైమా అవార్డుల పోటీలో. ప్రతి ఏడాది సౌత్‌ ఇండియాలో సినిమా వాళ్లకు సైమా అవార్డులు అందిస్తుంటుంది. ఈసారి ఓ అవార్డు కేటగరీలో సంపూతో మెగాహీరోలు పోటీపడుతుండటం విశేషం. బెస్ట్‌ డెబ్యూ హీరో కోసం ముగ్గురు హీరోల పేర్లు నామినీలుగా చేర్చింది సైమా. ఆ ముగ్గురు హీరోల్లో సాయిధరమ్‌తేజ్‌ (పిల్లా..నువ్వులేని జీవితం) వరుణ్‌తేజ్‌ (ముకుంద), సంపూ (హృదయకాలేయం) ఉన్నారు. దాంతో కొంతమంది మెగాఫ్యాన్స్‌ కూడా హర్టయ్యారు. సంపూతో మా హీరోల్ని పోలుస్తారా? అంటూ కినుక వహిస్తున్నారు.

మెగాహీరోలు మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు. వాళ్లకు అవార్డులు ఇచ్చినా తీసుకోరని టాక్‌. ఎందుకంటే సంపూతో పోటీపడి ఈ అవార్డులు దక్కించుకుంటే అది మరీ చీప్‌గా ఉంటుందని వాళ్ల ఉద్దేశ్యంగా చెబుతున్నారు. మొత్తానికి సైమా వల్ల మెగాహీరోలతో సంపూ పోటీ చేసే చాన్స్‌ దక్కింది!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ