ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరొందిన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రస్తుతం ఇండియాలోని మోస్ట్‌వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైన ప్రభుదేవా మెగాస్టార్ చిరంజీవి నటించిన పలుచిత్రాలకు డాన్స్‌కంపోజర్‌గా పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల ఆయన దర్శకునిగా బిజీ అయిన తర్వాత ఎంతోమంది పెద్దపెద్ద స్టార్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆఫర్ చేసినప్పటికీ ఆయన కొరియోగ్రఫీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి సైతం ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుదేవా తన మనసులోని మాటను బయటపెట్టాడు. చిరంజీవి నటించే 150వ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫీ వహించాలనేది ఆ కోరిక. ఇటీవలే ఇటువంటి కోరికనే రాఘవలారెన్స్ కూడా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఆఫ్‌దిస్క్రీన్ ప్రభుదేవా కంపోజ్ చేసే స్టెప్స్‌కు చిరు ఆన్‌ది స్క్రీన్ మూమెంట్స్ చేస్తుంటే ఆ కిక్కే వేరప్పా..! అని చెప్పవచ్చు.