>ఇటీవలే ‘మా’ అధ్యక్షునిగా ఎన్నికై మంచి ఊపుమీదున్న నటకిరీటి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత ‘జులాయి’ హిట్టయింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఫర్వాలేదనిపించింది. ఇక ఆయన చేసిన మిగతా సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. సో.. అందరూ ఇప్పుడు రాజేంద్రుడిని ఐరన్‌లెగ్ అని పిలుస్తున్నారు.తాజాగా ఆయన మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’, అక్కినేని అఖిల్ మొదటి సినిమా, ఎన్టీఆర్`సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. ఈ మూడిరటిలో ఏ రెండు చిత్రాలు హిట్టయినా రాజేంద్రుని కెరీర్‌కు ఢోకా ఉండదని, ఆయనపై ఐరన్‌లెగ్ ముద్ర చెరిపేయడం సాధ్యమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.