>ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ తన షాకింగ్ లుక్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా నెట్ వర్కింగ్‌లో పోస్ట్ చేశాడు. బిక్షగాడి అవతారంలో ఉన్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశాడు. మై న్యూలుక్... మేర్లపాక గాంధీ నన్ను ఇలా తయారు చేశారు... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ పాయింట్ బెగ్గర్స్ అసోసియేషన్ నుండి కాస్ట్యూమ్స్ వచ్చాయి. యువి క్రియేషన్స్ సినిమా కోసం ఈ లుక్ వేయాల్సివచ్చిందని ఆయన ట్వీట్ చేశాడు. మొత్తానికి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా కామెడీ పండిరచడంలో కూడా బ్రహ్మాజీది సపరేట్ స్టైల్ అని ఒప్పుకోవాల్సిందే.