రాజకీయాల సంగతి ఎలా ఉన్నా.. చిరంజీవిని కళాకారుడిగా మాత్రం అందరూ అభిమానిస్తారు. ఆయన రాజకీయపార్టీ పెట్టడం, దాన్ని కాంగ్రెస్‌లో కలిపివేయడం వంటి చర్యలను తీవ్రంగా ఖండిరచే వారు సైతం ఆయన సినిమాలంటే పిచ్చి అభిమానం చూపిస్తారు. తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఇక కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి, సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించనున్నట్లు సమాచారం. అందుకోసం ఆయన అందరి కథలు వింటున్నారు. పూరీని 150వ చిత్రం దర్శకునిగా ఎంచుకున్నప్పటికీ ఇటీవల ఆయన వి.వి.వినాయక్‌తో కూడా కథాచర్చలు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో చాలామంది పూరీ స్థానంలోకి వినాయక్ వచ్చాడనే ప్రచారం ఎక్కువైంది. అయితే చిరు వినాయక్‌తో జరిపిన స్టోరీ చర్చలు ఆయన నటించబోయే 151వ సినిమా కోసమని చిరు సన్నిహుతులు అంటున్నారు. సో.. మెగాస్టార్ అభిమానులకు ఇది తీయని వార్త అని చెప్పవచ్చు.