Advertisementt

మోహన్‌బాబు వర్సెస్‌ కృష్ణంరాజు...!

Wed 24th Jun 2015 04:07 AM
mohan babu,krishnam raju,baktha kannappa,manchu vishnu  మోహన్‌బాబు వర్సెస్‌ కృష్ణంరాజు...!
మోహన్‌బాబు వర్సెస్‌ కృష్ణంరాజు...!
Advertisement
Ads by CJ

గతంలో కృష్ణంరాజు హీరోగా ‘భక్తకన్నప్ప’ చిత్రం వచ్చి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని స్వయంగా కృష్ణంరాజు బాపు దర్శకత్వంలో నిర్మించాడు. కాగా ప్రస్తుతం శివభక్తుడైన తనికెళ్లభరణి ‘కన్నప్ప’ చిత్రాన్ని మొదట సునీల్‌తో అనుకొని ఆ తర్వాత మంచువిష్ణుతో చేయడానికి డిసైడ్‌ అయ్యాడు. ఈ చిత్రాన్ని ఓ హాలీవుడ్‌ సంస్థతో కలిసి మంచు విష్ణు స్వయంగా నిర్మించనున్నాడు. అయితే ‘భక్తకన్నప్ప’ చిత్రాన్ని ఎప్పటికైనా కృష్ణంరాజు ప్రభాస్‌తో చేయాలని భావిస్తున్నాడు. దీంతో ఇటీవల కృష్ణంరాజు మోహన్‌బాబుతో మంచు విష్ణుతో ‘కన్నప్ప’ చిత్రాన్ని ఆపేయాలని, తాను ఆ చిత్రాన్ని ప్రభాస్‌తో తీయాలనేది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని  రిక్వెస్ట్‌ చేశాడట. కానీ దానికి మోహన్‌బాబు నో చెప్పి, నువ్వు కావాలంటే మరలా తీసుకో.. మాకేం అభ్యంతరం లేదు.. అంతేగానీ మా సినిమాను ఆపేయమనడం సమంజసం కాదని కృష్ణంరాజుకు బదులిచ్చాడట. మొత్తానికి ‘కన్నప్ప’ వ్యవహారం మోహన్‌బాబు, కృష్ణంరాజుల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోందని మాత్రం ఒప్పుకోవాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ