ఎన్టీఆర్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. దీంతో ఈ చిత్రంపై అనేక రూమర్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. కాగా ఈ చిత్రం జులై మొదటి వారంలో లండన్‌లో షూటింగ్ ప్రారంభించుకోనుందని సమాచారం. కాగా ఈ సినిమా టీమ్ మాత్రం ఈనెల 28ననే లండన్‌కు పయనం కానుంది. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మా నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.