Advertisementt

‘టెంపర్‌’పై జగపతిబాబు కామెంట్స్!

Fri 26th Jun 2015 05:03 AM
jagapathi babu,temper,r narayana murthy,posani krishna murali,puri jagannadh  ‘టెంపర్‌’పై జగపతిబాబు కామెంట్స్!
‘టెంపర్‌’పై జగపతిబాబు కామెంట్స్!
Advertisement
Ads by CJ
>ఎన్టీఆర్‌, పూరీజగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘టెంపర్‌’ చిత్రంపై సీనియర్‌ నటడు జగపతిబాబు  మాట్లాడాడు. ఈ చిత్రానికి 45కోట్ల షేర్‌ వచ్చింది. అయినా మరో 8కోట్లు వచ్చివుండేవని ఆయన అంటున్నాడు. రీసెంట్‌గా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్లూలో తను గనుక పోసానికృష్ణమూర్తి పోషించిన నారాయణమూర్తి క్యారెక్టర్‌ను చేసి ఉంటే సినిమా రేంజ్‌ పెరిగేదని, దీంతో మరో ఏడెనిమిది కోట్ల కలెక్షన్లు వచ్చేవన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... హీరోయిజమ్‌ ఎప్పుడు బాగా ఎలివేట్‌ అవుతుందంటే... ఓ సీనియర్‌ హీరో.. తారక్‌ వంటి స్టార్‌ హీరోకు సెల్యూట్‌ చేసినప్పుడే అన్నారు. అలాగే తనకు తెలుగు చిత్ర పరిశ్రమ మరిన్ని ప్రత్యేకమైన చాలెంజింగ్‌ రోల్స్‌ ఇచ్చి వినియోగించుకోవచ్చని అన్నారు. అమితాబ్‌, ప్రాణ్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి వారు చేస్తున్న పాత్రలను తాను సమర్థవంతంగా చేయగలనని చెప్పారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ