Advertisementt

విక్రమ్‌ సరసన తెలుగమ్మాయి..!

Fri 26th Jun 2015 09:53 AM
vikram,10endrakulla,kajal,bindu madhavi,priyanandh  విక్రమ్‌ సరసన తెలుగమ్మాయి..!
విక్రమ్‌ సరసన తెలుగమ్మాయి..!
Advertisement
Ads by CJ

ఛాలెంజింగ్‌ పాత్రలు చేయాలన్నా, తమకున్న స్టార్‌డమ్‌ను పట్టించుకోకుండా వైవిధ్యమైన పాత్రలకు జీవం పోయాలన్నా కమల్‌హాసన్‌ తర్వాత చియాన్‌ విక్రమ్‌ పేరే చెప్పుకోవాలి. ఇటీవల విడుదలైన శంకర్‌`విక్రమ్‌ల ‘ఐ’ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడకపోయినప్పటికీ ఇందులో విక్రమ్‌ నటన చూసి యావత్‌ దేశం ఉప్పోంగిపోయింది. కాగా ప్రస్తుతం విక్రమ్‌ సమంతతో కలిసి మురుగదాస్‌ నిర్మాణంలో విజయ్‌మిల్టన్‌ దర్శకునిగా ‘10ఎంద్రకుల్లా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిన వెంటనే విక్రమ్‌ మరో సినిమాకు ఓకే చెప్పాడు. మురుగదాస్‌ శిష్యుడు, ‘అరిమనంబి’ ఫేమ్‌ ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ ‘మర్మమణితాన్‌’. తెలుగులో ఎవ్వరికీ అర్థంకాని మనిషి అని అర్థం. కాగా ఈ చిత్రంలో మొదట కాజల్‌, ప్రియాఆనంద్‌లను అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఈ చిత్రం నుండి ప్రియాఆనంద్‌ తప్పుకోంది. కాగా ఆ స్థానంలో తెలుగు, తమిళ ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకున్న బిందుమాధవి ఎంపికయినట్లు సమాచారం. దీంతో బిందుమాధవి దశ తిరుగుతుందని కోలీవుడ్‌ మీడియా అంటోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ