ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించ తలపెట్టిన సినిమా వుందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌లో వున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికి రెండు సార్లు లండన్‌లో షూటింగ్ చెయ్యబోతున్నామంటూ ప్రకటించినప్పటికీ అది ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. ఓ పక్క ఈ సినిమా అస్సలు లేదని, ఆగిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో లేటెస్ట్‌గా ఈ సినిమా స్టార్ట్ అవ్వబోతోందంటూ న్యూస్ వచ్చింది. జూలై 6 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఓ భారీ షెడ్యూల్ లండన్‌లో, దాని తర్వాత మరో దేశంలో 20 షెడ్యూల్ చేసి మిగతా షూటింగ్ అంతా హైదరాబాద్‌లో చేస్తారని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలీదుగానీ జూలై 1న యూనిట్ అంతా లండన్ వెళ్తుందని చెప్తున్నారు. ఇంతకుముందు ఇచ్చిన న్యూస్‌లో జూన్ 25 నుంచి లండన్‌లో షూటింగ్ జరుగుతుందని, ఆల్రెడీ సుకుమార్, ఫైట్‌మాస్టర్ పీటర్ హెయిన్స్ లండన్‌లోనే వున్నారని చెప్పారు. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లో జూలై 6న పక్కాగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని మాత్రం చెప్తున్నారు యూనిట్ సభ్యులు.