Advertisementt

‘కిక్‌2’కి అదే స్పెషల్‌ హైలైట్‌ అవుతుందట.!

Sat 27th Jun 2015 06:26 AM
raviteja new movie kick2,kick2 background music completed,rakul preeth in kick2,kick2 producer kalyan ram  ‘కిక్‌2’కి అదే స్పెషల్‌ హైలైట్‌ అవుతుందట.!
‘కిక్‌2’కి అదే స్పెషల్‌ హైలైట్‌ అవుతుందట.!
Advertisement
Ads by CJ

రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్‌’ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇదే కాంబినేషన్‌లో ఆ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ‘కిక్‌2’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి సిద్ధమవుతోంది. కిక్‌ చిత్రంతో తెలుగులో సంగీత దర్శకుడుగా పరిచయమైన థమన్‌ కిక్‌2 విషయంలో చాలా కేర్‌ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే కిక్‌ ఆడియోలాగ కిక్‌2 పాటలకి అంతగా ఆదరణ లభించడం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. సినిమా రిలీజ్‌ తర్వాత ఆడియోకి ఎక్కువ రెస్పాన్స్‌ వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇదిలా వుంటే డాల్బీ ఎట్మాస్‌ సౌండ్‌ సిస్టమ్‌తో ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని చేశాడట థమన్‌. సినిమాకి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ స్పెషల్‌ హైలైట్‌ అవుతుందని చెప్తున్నాడు థమన్‌. ఇటీవలే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వర్క్‌ కూడా కంప్లీట్‌ అయింది. ఈ సినిమా రిలీజ్‌ విషయంలో చాలా డేట్స్‌ అనుకోవడం, అవి పోస్ట్‌పోన్‌ అవడం జరిగింది. జూలై 17న ఈ సినిమాని రిలీజ్‌ చేద్దామని అనుకున్నారు. బాహుబలి పుణ్యమా అని ఇప్పుడు కిక్‌2 చిత్రాన్ని ఆగస్ట్‌లో రిలీజ్‌ చెయ్యాలని నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌ డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ