Advertisementt

గిన్నిస్‌బుక్‌లోకి ‘బాహుబలి’...?

Sat 27th Jun 2015 12:23 PM
bahubali,guinness book of world records,bahubali thamil version  గిన్నిస్‌బుక్‌లోకి ‘బాహుబలి’...?
గిన్నిస్‌బుక్‌లోకి ‘బాహుబలి’...?
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాహుబలి’ చిత్రం అద్భుతాల సాధన దిశగా అడుగులు వేస్తోంది. సినిమా విడుదలయ్యాక ఎన్ని రికార్డులు సృష్టించనుందో గానీ ముందే బ్రహ్మాండం బద్దలు కొడుతోంది. శాటిలైట్‌ రూపంలో , ఆడియో హక్కుల రూపంలో, ఏరియాల రైట్స్‌ విషయంలో ఇప్పటికే రికార్డుల మోత మోగిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు గిన్నిస్‌బుక్‌ రికార్డ్స్‌లోకి ఎక్కబోతోంది. ‘బాహుబలి’ మలయాళ వెర్షన్‌ ఆడియో(శనివారం) కేరళలో జరిగింది. ఈ సందర్భంగా కొచ్చిలో ఓ భారీ పోస్టర్‌ని ఆవిష్కరించబోతున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దపోస్టర్‌ అట. ఈ పోస్టర్‌ని చూడటానికి గిన్నిస్‌బుక్‌ ప్రతినిదులు వస్తున్నారని తెలుస్తోంది. వాళ్లు గనుక ఇదే అత్యంత పెద్ద పోస్టర్‌ అని భావిస్తే ‘బాహుబలి’గిన్నిస్‌బుక్‌ ఎక్కేస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ