‘పటాస్’ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు నందమూరి కళ్యాణ్‌రామ్. ఇప్పుడు ఆయన ‘షేర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో సోనాల్‌చౌహాన్ హీరోయిన్. ఇప్పుడు మరో భామ ‘షేర్’లో చేరింది. ఆమె హీరోయిన్ కాదు... ఆమె ఐటంగర్ల్ నోరాఫతేహి. ఎన్టీఆర్ ‘టెంపర్’ చిత్రంలో ఆమె ఐటంసాంగ్‌లో ఇరగదీసింది. ఇప్పుడు ‘షేర్’లో ఆమె కళ్యాణ్‌రామ్‌తో కలిసి స్టెప్స్ వేయనుంది. ‘షేర్’లో ఐటంసాంగ్ కోసం ఆమెను సంప్రదించడం అందుకు ఆమె అంగీకరించడం జరిగిపోయింది. త్వరలోనే ఈ ఐటం సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి మల్లికార్జున్ దర్శకుడు.