Advertisementt

సంగీత దర్శకుని చిత్రంలో పాటలే లేవట..!

Mon 29th Jun 2015 01:39 PM
rp patnaik,music director,broker movie,prathikshanam movie  సంగీత దర్శకుని చిత్రంలో పాటలే లేవట..!
సంగీత దర్శకుని చిత్రంలో పాటలే లేవట..!
Advertisement
Ads by CJ
దాదాపు దశాబ్దం కిందట తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ట్యూన్స్‌తో సంగీత దర్శకునిగా, గాయకునిగా కూడా సంచలనం సృష్టించిన సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌. అయితే ఆయన ఆ తర్వాత నటునిగా మారి కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇటీవల ‘బ్రోకర్‌’ చిత్రంతో దర్శకునిగా మారి విమర్శకుల ప్రశంసలు పొందాడు. తాజాగా ఆయన ప్రియమణి ప్రధానపాత్రలో ‘ప్రతిక్షణం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాధారణంగా సంగీత దర్శకుడే సినిమా దర్శకుడైతే అందులో సంగీతానికి, పాటలకు మంచి స్కోప్‌ ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ చిత్రంగా ఆర్‌.పి.పట్నాయక్‌ ఈ చిత్రంలో  అసలు పాటలే ఉండవని అంటున్నాడు. ఆలోటును బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో తీరుస్తానని, ఈ చిత్రంలో పాటలు పెడితే కథకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టే పాటలు లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని ఆర్‌.పి.పట్నాయక్‌ చెప్పుకొచ్చారు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ