యువహీరో నాగశౌర్య ఇటీవల విడుదలైన ‘జాదూగాడు’ చిత్రంలో మాస్ పాత్రను పోషించి ఓకే అనిపించుకున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన చేతిలో రెండు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్. అయితే తాజాగా నాగశౌర్య తన దగ్గరకు సినిమాలు చేసే వారు వస్తే వారు చెప్పే స్టోరీలను పక్కనపెట్టి మంచి మాస్ సబ్జెక్ట్స్‌తో రమ్మని అప్పుడే సినిమా చేస్తానని చెబుతుండటంతో దర్శకనిర్మాతలు భయపడిపోతున్నారు. ఎప్పుడో ఒకటి అరా చిత్రాలను జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ అనే తరహాలో మాస్ చిత్రాలు చేయడం తప్పేమి కాదు. కానీ ఇక నుండి తాను చేసే ప్రతి చిత్రం మాస్ చిత్రంగా ఉండాలని ఆయన కోరుకోవడం ఆయన కెరీర్‌కి మంచిది కాదని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి ఇప్పుడు టాలీవుడ్‌లో లవర్‌బోయ్ ఇమేజ్ ఉన్న హీరోలకు పోటీ తక్కువగా ఉంది. ఆ విషయాన్ని తెలుసుకొని ముందుకు సాగితే నాగశౌర్యకు మరో పదేళ్లపాటు ఢోకా ఉండదు. కానీ స్వయాన ఆయన తన కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటున్నాడని, గతంలో సునీల్ కూడా తన దగ్గరకు కామెడీ స్టోరీలతో వచ్చే వారిని మాస్ స్టోరీలు తెమ్మని చెప్పి, కేవలం యాక్షన్, మాస్ చిత్రాలపై దృష్టి పెట్టి ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.