Advertisementt

రాజమౌళి టెన్షన్‌ అంతా అందుకోసమే..!

Wed 01st Jul 2015 12:27 AM
rajamouli,bahubali,july 10th release,bahubali trailer  రాజమౌళి టెన్షన్‌ అంతా అందుకోసమే..!
రాజమౌళి టెన్షన్‌ అంతా అందుకోసమే..!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’ జులై 10  వ తేదీన విడుదలకానుంది. అయితే ఏ చిత్రానికి పడని టెన్షన్‌ను రాజమౌళి ఇప్పుడు ఫీలవుతున్నాడట. ఈ చిత్రం తెలుగులో పెద్ద హిట్టయినా రాజమౌళికి సంతోషం ఉండదని, ఈ చిత్రం బాలీవుడ్‌లో ఎలా ఆడనుంది? ఎన్నికోట్లు కలెక్ట్‌ చేయనుంది? ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో రాజమౌళికి ఎంతటి ప్రశంసలు లభిస్తాయి? బాలీవుడ్‌ నిర్మాతలను, స్టార్‌హీరోలను ‘బాహుబలి’ ఎలా ఆకట్టుకోనుంది? అనే విషయాలపైనే రాజమౌళి పూర్తిగా దృష్టి పెట్టాడట. కారణం రాజమౌళి తదుపరి ప్రస్దానం బాలీవుడ్‌కే అని, అందుకు ‘బాహుబలి’ని ఓ ట్రైలర్‌గా వాడుకోనున్నాడని, ఈ చిత్రం బాలీవుడ్‌లో మంచి హిట్టు అయితే రాజమౌళి కోరిక తీరుతుందని తెలుస్తోంది. ఇంతకీ రాజమౌళి కోరిక ఏమిటి? అంటే బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌తో ఓ చిత్రం చేయడమే రాజమౌళి ఆకాంక్ష, ఆశ...అని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ