>ప్రస్తుతం నితిన్ ఖాళీగా ఉన్నాడు. అక్కినేని అఖిల్ చిత్రం నిర్మాణ పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆయన మల్లిడి వేణు అనే నూతన దర్శకునితో ఓ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అయితే తనలాగే ఖాళీగా ఉన్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని ఉబలాటపడుతున్నాడు. త్రివిక్రమ్ ఒప్పుకుంటే తమ సొంత బేనర్‌లోనే ఆ చిత్రాన్ని తీస్తానని, లేకుంటే వేరే నిర్మాత అయితే రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా చేస్తానని ఆల్‌రెడీ త్రివిక్రమ్‌కు సందేశం కూడా పంపాడట. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు తమ హీరో త్రివిక్రమ్ కోసం ప్రయత్నిస్తుండటంతో కొత్త దర్శకుడు మల్లిడి వేణు ఎంతో టెన్షన్ అనుభవిస్తున్నాడట. ఎక్కడ త్రివిక్రమ్ సినిమా ఓకే అయితే తన సినిమా దూరంగా వెళ్లిపోతుందనేది ఆయన టెన్షన్ అంటున్నారు. మరి మల్లిడి వేణు భవిష్యత్తు మాటల మాంత్రికుడి నిర్ణయంపై ఆధారపడి ఉంది.