>‘బాహుబలి’ ప్రమోషన్స్‌తో యమా బిజీగా ఉన్నాడు దర్శకుడు రాజమౌళి. ఇందులో భాగంగా ఆయన కోలీవుడ్,టాలీవుడ్, బాలీవుడ్‌లను చుట్టేస్తున్నాడు. తాజాగా ముంబైలో జరిగిన ప్రచార కార్యక్రమానికి ఆయన నిర్మాత కరణ్‌జోహార్‌తో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్బంగా మీడియా నుండి రాజమౌళికి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక్కడ మీకు నచ్చిన హీరో ఎవరు? ఎవరితో సినిమా చేయాలనుంది? మీ అభిమాన దర్శకుడు ఎవరు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు జక్కన్న బాలీవుడ్ మీడియాకు సమాధానం ఇస్తూ... ‘కంపెని’ చూసి అజయ్‌దేవగణ్‌కు ఫేవరేట్‌ను అయిపోయాను. సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్’ చూసి ఆయనకు ఓ కథ సిద్దం చేయాలనిపించింది. ‘లగాన్’ చూసినప్పుడే ఎలాగైనా అమీర్‌ఖాన్‌తో ఓ సినిమా చేయాలని అనుకున్నాను... అంటూ సమాధానమిచ్చాడు. ఇక మీ అభిమాన డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్నకు ఆయన సమాదానమిస్తూ.. సూటిగా స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. దర్శకుడు రాజ్‌కుమార్‌హిరాణికి నేను పెద్ద వీరాబిమానిని. ఆతనే నా ఫేవరేట్ అన్నాడు రాజమౌళి.