అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవుతూ వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ థాయ్‌లాండ్‌లోని సమాయ్‌లో జరుగుతోంది. దీంతో అఖిల్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌లు షూటింగ్ కోసం అక్కడికి వెళ్లారు. ఈ సందర్బంగా అఖిల్ వారితో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. కామెడీ కింగ్స్‌తో కలిసి పనిచేయడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అఖిల్‌కు సెల్ఫీలంటే మహా మోజులా ఉంది. ప్రతి రెండు మూడు రోజులకు ఆయన ఏదో ఒక సెల్ఫీని పోస్ట్ చేస్తున్నాడు.