టాలీవుడ్‌లో బాలకృష్ణ సరసన ‘లెజెండ్, లయన్’ చిత్రాల్లో నటించిన రాధికాఆప్టే ఆమధ్య టాలీవుడ్‌పై తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాగా మరలా ఆమె అలాంటి విమర్శలనే మరలా చేసింది. ఇక్కడి నిర్మాతలకు మహిళలంటే గౌరవం లేదని మరోసారి దుమ్మెత్తిపోసింది. హీరోల ఆధిక్యం అధికం అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అందుకే టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు వస్తున్నా నిరాకరిస్తున్నట్లు తెలిపింది. తనకు సౌత్ ఇండస్ట్రీ గురించి బాగా అర్దమైందని తమిళ, కన్నడ పరిశ్రమల్లో వివక్ష లేదని, కానీ టాలీవుడ్‌లో మాత్రం అది ఎక్కువగా ఉంటుందని గళమెత్తింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేసిన ఈ అమ్మడు త్వరలో ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటించడానికి ఒప్పుకొన్న సంగతి తెలిసిందే.