‘బాహుబలి’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోన్న కొద్దీ సినిమా ప్రమోషన్స్‌వేగం పెంచారు. రాజమౌళి వివిధ మీడియా సంస్థల ఇంటర్వ్యూలలో పాల్గొంటు బిజీగా గడుపుతున్నాడు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోన్న కొద్ది టెన్షన్ పెరిగిపోతోందని, లోపలి ఒత్తిళ్లను కవర్ చేసుకోవడానికి బలవంతంగా నవ్వాల్సి వస్తోందని ఓ ప్రశ్నకు సమాధానంగా రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పటివరకు సినిమా చూడలేదని, దీంతో తమపై ఒత్తిడి పెరిగిపోయిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.