అభిమానుల అనుమానాలకు తెరదించుతూ మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ చిత్రం కొన్ని పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఆగష్టు 7న విడుదలకు సంసిద్దమవుతోంది. మహేష్‌బాబు ఈ చిత్రం విషయంలో ఎంతో నమ్మకంతో ఉన్నాడు. ఈసారి ‘శ్రీమంతుడు’తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ వర్క్‌ను మహేష్ ప్రారంభించాడు. కాగా ఈ చిత్రం ఆడియో ఇదే నెల విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ తన కెరీర్‌లోనే సూపర్బ్ ట్యూన్స్‌ను ఇచ్చినట్లు, ఇందులోని ప్రతిపాట ఉర్రూతలూగించడం ఖాయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.