దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉన్నాడు. మెగాస్టార్ నటించే 150వ చిత్రం డైలాగ్ వెర్షన్ కోసం ఆయన బ్యాంకాకు వెళ్లాడని తెలుస్తోంది. కాగా ఆయన 7వతేదీన మరలా హైదరాబాద్ రానున్నాడు. జులై 9 నుండి వరుణ్‌తేజ్‌తో చేసే ‘లోఫర్’ చిత్రం మొదలెడతాడు. మూడు రోజుల షూటింగ్‌ను హైదరాబాద్‌లో జరిపి తదుపరి లాంగ్‌షెడ్యూల్ కోసం జులై 20న జోధ్‌పూర్ వెళతాడు. ‘లోఫర్’ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని జోడీగా నటించనుంది. సునీల్ కాశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడు. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, రేవతి, పోసాని తదితరులు ముఖ్యపాత్రలను పోషించనున్నారు. జోధ్‌పూర్ నుండి ఆగష్టు 20న తిరిగి హైదరాబాద్ వస్తాడు. ఆగష్టు 22న మెగాస్టార్ బర్త్‌డే సందర్బంగా హైదరాబాద్ వచ్చి ఆ వెంటనే చిరుతో చిత్రానికి క్లాప్ కొడతాడు. ఆ తర్వాత మరలా ‘లోఫర్’ చిత్రాన్ని పూర్తి చేసి అక్టోబర్ నుండి మెగాస్టార్ 150 వచిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నాడు. పూరీనా మజాకా...!