నవతరం సంగీత దర్శకుల్లో తమన్‌ది ఓ ప్రత్యేకశైలి. ఆయన తన చిత్రాల్లో నటించే హీరోహీరోయిన్ల చేత స్వయంగా వారిచేతనే ఓ పాట పాడిస్తూ వస్తుంటాడు. కాగా ఈ సారి ఆయన నందమూరి బాలకృష్ణ చేత ‘డిక్టేటర్’ చిత్రంలో ఓ పాటను పాడిరచడానికి రంగం సిద్దం చేస్తున్నాడట. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డిక్టేటర్’ చిత్రానికి తమనే సంగీత దర్శకుడు అన్నది తెలిసిందే. ఆమధ్య బాలయ్య ఓ కార్యక్రమంలో స్టేజీపై పాటలు పాడిన సీన్ జనాలకు గుర్తుండే వుంటుంది. మరి తమన్ అనుకున్నట్లు బాలయ్యను ఒప్పించి ఆయన చేత ఓ పాట పాడిస్తే నందమూరి అభిమానులందరూ హ్యాపీగా ఫీలవ్వడం ఖాయమని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.