Advertisementt

వార్తల్లోకి శేఖర్‌కమ్ముల-మహేష్‌ సినిమా!

Sun 05th Jul 2015 03:09 PM
sekhar kammula,mahesh babu,leader movie,godavari,puri jagannadh  వార్తల్లోకి శేఖర్‌కమ్ముల-మహేష్‌ సినిమా!
వార్తల్లోకి శేఖర్‌కమ్ముల-మహేష్‌ సినిమా!
Advertisement
Ads by CJ
>సున్నితమైన కథాంశాలతో, వైవిధ్యమైన కథలతో, విభిన్న భావోద్వేగాలు గల చిత్రాలను తెరకెక్కించే డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల. కాగా శేఖర్‌ కమ్ములతో ఒక సినిమాను మహేష్‌ చేయనున్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ‘లీడర్‌’ చిత్రం సమయంలో బలంగా వినిపించాయి. వాస్తవానికి ‘గోదావరి’ చిత్రాన్ని శేఖర్‌కమ్ముల మహేష్‌తో తీయాలని భావించాదు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సుమంత్‌తో ఆ సినిమా చేయాల్సివచ్చింది. కాగా స్క్రిప్ట్‌కు ఎక్కువ సమయం కేటాయించే శేఖర్‌కమ్ముల మరలా ఇంతకాలం తర్వాత ఓ అద్భుతమైన స్టోరీలైన్‌ని మహేష్‌కు వినిపించగా, మహేష్‌కు బాగా నచ్చడంతో త్వరలోనే చిత్రం చేద్దామని శేఖర్‌కమ్ములకు మాట ఇచ్చాడట. మరో పక్క మహేష్‌ ఒప్పుకున్న డైరెక్టర్ల క్యూ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయన పూరీజగన్నాథ్‌, త్రివిక్రమ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఈ ఇద్దరితో సినిమా తీసిన తర్వాత ఆయన శేఖర్‌కమ్ములతో సినిమా చేసే అవకాశం ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ