Advertisementt

కమల్‌పై మొదటిభార్య ఎటాక్!

Sun 05th Jul 2015 11:49 PM
kamal haasan,vaani ganapathi,sarika,gouthami,vaani ganapathi about kamal,shruti haasan  కమల్‌పై మొదటిభార్య ఎటాక్!
కమల్‌పై మొదటిభార్య ఎటాక్!
Advertisement
Ads by CJ
>ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు ఇప్పటికే రెండు వివాహాలు, రెండు సార్లు విడాలకులైన సంగతి తెలిసిందే. తొలుత శాస్త్రీయ నృత్యకళాకారిణి వాణిగణపతిని పెళ్లాడిన ఆయన పదేళ్ల కాపురం తర్వాత ఆమెతో విడిపోయాడు. తర్వాత సారికను పెళ్లాడిన ఆయన ఇద్దరు పిల్లలు శృతిహాసన్‌, అక్షరహాసన్‌లకు తండ్రి అయ్యాడు. సారిక, కమల్‌హాసన్‌ 2004లో విడిపోయారు. ప్రస్తుతం కమల్‌హాసన్‌ నటి గౌతమితో సహజీవనం చేస్తున్నాడు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమల్‌ విడాకుల కారణంగా తాను దివాలా తీసినట్లు పేర్కొన్నాడు. కమల్‌ వ్యాఖ్యలపై ఆయన మొదటి భార్య వాణిగణపతి తీవ్రంగా స్పందించింది. తనకు విడాకులు ఇచ్చిన తర్వాతనే అద్దె ఇంట్లోకి మారాల్సివచ్చిందని కమల్‌ పేర్కొనడంపై ఆమె ఫైర్‌ అయింది. తనతో పెళ్లయిన సమయంలో కమల్‌కు అసలు ఇల్లే లేదని, అప్పుడు మేము అద్దె ఇంట్లోనే ఉండేవాళ్లం. ఏదైనా తప్పు జరిగితే ఇతరుల మీదకు తోసేయడం ఆయనకు అలవాటు అని, దివాలా తీయడానికి విడాకులు కాకుండా వేరే కారణాలు ఉండి ఉంటాయని ఆమె ఘాటుగా స్పందించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ