>చాలా రోజుల తర్వాత ‘ఓకే కన్మణి’తో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం మరలా ఫామ్‌లోకి వచ్చాడు. తాజాగా ఆయన మరో చిత్రం ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇంతకు ముందు ఆయన తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన హీరో సిద్దార్ధ్‌తో ‘యువ’ చిత్రం చేశాడు. కాగా త్వరలో ఆయన తన మరో అసిస్టెంట్‌తో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అతను ఎవరో కాదు.. తమిళ స్టార్ కార్తి. గతంలో హీరో కాకముందు కార్తి మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. అదే కార్తితో ఓ అద్బుతమైన స్టోరీ రెడీ చేసుకొని మణి సినిమాకు సిద్దం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని ఆయన తమిళ, మలయాళ భాషల్లో రూపొందించనున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేయనున్నారు.