>‘దృశ్యం’ చిత్రానికి రీమేక్‌గా తమిళంలో కమల్‌హాసన్, గౌతమి ముఖ్యపాత్రల్లో నిర్మితమైన చిత్రం ‘పాపనాశం’. ఈ చిత్రానికి ఒరిజినల్ మలయాళ మాతృక దర్శకుడు జీతూజోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ చిత్రం విడుదలై మంచి స్పందన రాబట్టుకొంటోంది. కాగా, ఈ చిత్రంలో ఓ పొరపాటు చోటుచేసుకున్నట్లు తమిళ సినిమా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ చిత్రంలో కమల్‌హాసన్ ఆగష్టు 3వ తేదీన ‘అంజాన్’ (సికిందర్) చిత్రానికి తన పిల్లలను తీసుకెళ్తాడు. అదే తేదీపై సినిమా మొత్తం నడుస్తుంది. అయితే సూర్య నటించిన ‘అంజాన్’ చిత్రం ఆగష్టు 15న విడుదలైంది. అది గమనించకుండా ఆగష్టు3 అని చెప్పారు. వినడానికి చిన్న పొరపాటే అయినా సినీ ప్రేమికుల విషయానికి వస్తే ఇది బ్లండర్ మిస్టేక్‌గానే పరిగణించాల్సి వస్తుంది.