Advertisementt

నయన ఆ హీరోతో మాత్రం చేయనంటోంది!

Thu 09th Jul 2015 01:45 PM
nayanathara,vikram,thamil industry,anand shankar  నయన ఆ హీరోతో మాత్రం చేయనంటోంది!
నయన ఆ హీరోతో మాత్రం చేయనంటోంది!
Advertisement
Ads by CJ

వయసు పెరిగినా తరగని ఇమేజ్‌తో ఎన్నోఏళ్లుగా అందరు హీరోలకు, అది సీనియర్‌ స్టార్స్‌ అయినా లేక కొత్త హీరోలు అయినా పట్టింపులేకుండా సినిమాలు చేస్తోన్న సౌత్‌ ఇండియన్‌ టాప్‌స్టార్‌ హీరోయిన్స్‌లో నయనతార ఒకరు. ఆమె విలక్షణ నటుడు విక్రమ్‌తో మాత్రం కలిసి నటించేది లేదంటోంది. దీనికి కారణం తెలియక తమిళ ఇండస్ట్రీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. గతంలో నయనకు విక్రమ్‌తో నటించే అవకాశం వచ్చింది. అయితే అంతకు ముందే ఆమె వేరే సినిమాకి డేట్స్‌ ఇవ్వడం వల్ల ఆ సినిమాకు ఇబ్బంది రాకుండా విక్రమ్‌ సినిమాకు డేట్స్‌ కేటాయిస్తానని ఎంతచెప్పినా విక్రమ్‌తో పాటు ఆ చిత్రం యూనిట్‌ మరో సినిమా చేయడానికి వీలులేదు. మా సినిమా పూర్తయ్యేవరకు వేరే సినిమాలో నటించడం కుదరదని ఆమెను బాగా వేధించారట. దాంతో ఆమె విక్రమ్‌ సినిమా చేయనని చెప్పి, ఇకపై కూడా విక్రమ్‌తో సినిమా చేసేది లేదని ఖరాఖండీగా చెప్పిందట. మరలా చాలాకాం తర్వాత ‘అరిమనంబి’ ఫేమ్‌ ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా చేస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించమని నయనను అడిగారట. అయితే తాను ఒక్కసారి డిసైడ్‌ అయితే మరలా దాన్ని మర్చిపోనని, విక్రమ్‌ సినిమాలో నటించను.. అని తెగేసి చెప్పేసిందట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ