సినీ ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రాపై సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సంచన వ్యాఖ్యలు చేశాడు. తన నుండి డబ్బు గుంజడానికే తనపై దావా వేశాడంటూ మండిపడ్డాడు. తన వియ్యంకుడు కస్తూరిరాజా 65 లక్షలు ముకుంద్ బోత్రా వద్ద అప్పుగా తీసుకున్నాడని, ఆ అప్పుకు తాను హామీదారునిగా లేకపోయినా తన నుండి ఆ డబ్బు వసూలు చేయడానికి దావా వేశారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
అయితే పైనాన్షియర్ ముకుంద్ బోత్రా వాదన మరోలా ఉంది. రజనీ వియ్యంకుడు కస్తూరిరాజా 2012లో ఓ సినిమా విషయమై తన వద్దకు వచ్చి ఒక్కసారి 40లక్షలు, మరోసారి 25 లక్షలు తీసుకున్నాడని, తాను డబ్బు చెల్లించకపోతే తన కుమారుడు ధనుష్ మామగారైన రజనీకాంత్ చెల్లిస్తాడని చెప్పారని, అందుకే తాను దావా వేశానని ఆయన వాదిస్తున్నాడు. మరి ఈ సమస్య ఎటువైపు ముపుతిరుగుతుందో తెలియకుండా ఉంది.