గత కొన్నిరోజుగా ‘బాహుబలి’ ప్రమోషన్స్ నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. ఓ రేంజ్లో జరుగుతున్న ఈ ప్రమోషన్స్ లలో ప్రభాస్, రానా, తమన్నా, రాజమౌళి, సాబుసిరిల్ వంటి ప్రతి ఒక్కరు సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ ప్రమోషన్ చేస్తున్నారు. అయితే వీటిల్లో ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన అనుష్క మాత్రం హాజరుకావడం లేదు. ఒక్క ఆడియో ఫంక్షన్‌కు మాత్రమే వచ్చింది. బాలీవుడ్ ప్రమోషన్లో కూడా ఆమె కనిపించలేదు. మరి కారణాం ఏమిటి? అని అడిగితే యూనిట్ సభ్యులు మాత్రం ఆమె ‘సైజ్‌జీరో’ సినిమా షూటింగ్లో భాగంగా బ్యాంకాక్ షూటింగ్లో పాల్గొంటున్నది అని, అంత బిజీ కారణంగానే ఆమె ‘బాహుబలి’ టీమ్‌కు ప్రమోషన్ విషయంలో హ్యండిచ్చిందని.. అంటున్నారు.