ఈతరం హీరోయిన్లు పెళ్లి విషయంలో కాస్త తొందరపడుతున్నారు. హీరోయిన్లుగా ఫామ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అవ్వాని కోరుకుంటున్నారు. అయితే టాప్‌హీరోయిన్ శృతిహాసన్ మాత్రం పెళ్లి విషయంలో వైరాగ్యంగా మాట్లాడుతోంది. అసలు జీవితంలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటోంది. ఆమె మాట్లాడుతూ... అసలు పెళ్లి ఆలోచను నాకెప్పుడు రాలేదు. బహుశా నేను పెళ్లి చేసుకోనేమో.. అంటోంది. మీ అమ్మానాన్న వివాహబంధం విడిపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే అదేమీ లేదు. ఒకరి జీవితం ఉన్నట్లు మరొకరి జీవితం సాగాని లేదు. అంటోంది. తాను తీసుకున్న నిర్ణయంలో ఎవరి ప్రభావం లేదంటూ సమాధానమిస్తోంది. మరి ఈ విషయంలో శృతిహాసన్‌కు అంత వైరాగ్యం ఎందుకు వచ్చిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.