తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టించింది. సుమారుగా నాలుగు వేల థియేటర్లలో విడుదలయిన ఈ చిత్రం మొదటి రోజు భారీ వసూళ్లను సొంతం చేసుకుంటుందని ట్రేడ్ వర్గాలు ముందే అంచనా వేసాయి. 'బాహుబలి' మేనియాలో ఉన్న సినీ ప్రేమికులు టికెట్ల రేట్లు ఎంత ఉన్న మరో ఆలోచనలేకుండా కొన్నారు.
అనుకున్నట్లుగానే 'బాహుబలి' మొదటి రోజు కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది. నాలుగు బాషలలో విడుదలయిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21.63 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. సినిమాపై మిశ్రమ స్పందన వస్తున్నా వసూళ్ళ విషయంలో మాత్రం 'బాహుబలి' అగ్ర స్థానంలో ఉంది. ఇప్పుడు వరుసగా శని, ఆదివారాలు కూడా 'బాహుబలి' కి తోడయ్యాయి. సో.. కనీ విని ఎరుగని రీతిలో ఆకాశమే హద్దుగా ఈ వసూళ్లు చెలరేగేలా ఉన్నాయి.