‘బాహబలి’ చిత్రంపై టాలీవుడ్‌లో మొదటి నుండి క్రేజ్ ఉంది. ఇండియన్ సినీ చరిత్రలో అత్యదిక బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై రాజమౌళికే కాదు... తెలుగులో సాదారణ ప్రేక్షకుడు కూడా ఈస్థాయి ఓపెనింగ్స్ ఉంటాయని అందరూ ఊహించారు. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళి గోల్, లక్ష్యం, గురి.. అన్నీ బాలీవుడ్ మీదనే. ఈ చిత్రం బాలీవుడ్‌లో సంచనాలు సృష్టిస్తే.. తాను ఒక్కసారిగా ఇండియన్ టాప్‌మోస్ట్ డైరెక్టర్‌గా ఎదుగుతానని రాజమౌళి ఆశపడ్డాడు. అందుకే కరణ్‌జోహార్‌ను ఒప్పించి అతని ధర్మా ప్రొడ్‌క్షన్స్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేశాడు. కానీ ఈ చిత్రానికి బాలీవుడ్‌లో ఓ మోస్తరు కలెక్షన్స్ కూడా లేవని సమాచారం. థియేటర్లు హౌస్‌ఫుల్ కాలేదు.. మల్టీప్లెక్స్ లు ఖాళీగా కనిపించాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల ఉవాచ. అందునా కేవలం రానా, తమన్నా తప్ప ఇందులో బాలీవుడ్‌కు పరిచయం ఉన్న నటులెవ్వరూ లేరు. అయినా కూడా ఈ చిత్రం అక్కడ భారీ కలెక్షన్లు కొల్లగొడుతుందని భావిస్తే, అది కాస్తా నిజరూపం దాల్చలేదు. దీన్ని ఓ బిగ్రేడ్ డబ్బింగ్ సినిమా కింద అక్కడ ప్రేక్షకులు అంచనా వేశారు. పోనీ పోను పోను కలెక్షన్లు పుంజుకుంటాయనే భరోసా కూడా లేదు. కారణం వచ్చే శుక్రవారం రంజాన్ కానుకగా సల్మాన్‌ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ విడుదల అవుతోంది. అప్పటికి బాలీవుడ్‌లో ‘బాహుబలి’ తిరుగుటపా ఖాయం అంటున్నారు.