Advertisementt

వామ్మో..ఆ హీరో పారితోషికం 30 కోట్లు!

Mon 13th Jul 2015 04:16 AM
vijay,ilayathalapathy vijay,tamil star hero,30 crores remuneration  వామ్మో..ఆ హీరో పారితోషికం 30 కోట్లు!
వామ్మో..ఆ హీరో పారితోషికం 30 కోట్లు!
Advertisement
Ads by CJ

తమిళ అగ్ర కథానాయకుడు  విజయ్ పారితోషికం పరంగా కొత్త రికార్డును సృష్టించారు. నిర్మాత కలైపులి థాను నిర్మించబోయే చిత్రానికి విజయ్ 30కోట్ల (ఇన్‌కమ్‌ట్యాక్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మినహాయించి) పారితోషికాన్ని తీసుకున్నారని తెలిసింది. దీంతో దక్షిణాదిలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అత్యధిక పారితోషికాన్ని అందుకున్న హీరోగా విజయ్ సరికొత్త రికార్డు సృష్టించారు. తారల అభిమానగణం, వారి సినిమాల విజయాలశాతం, పెట్టిన పెట్టుబడికి వచ్చే లాభాల ఆధారంగా హీరోల పారితోషికాన్ని నిర్ణయించడం ఆనవాయితీగా వస్తోంది. తమిళ హీరో విజయ్‌కు మలయాళంలో కూడా మంచి మార్కెట్ వుండటంతో ఆయన పారితోషికం గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు. ఇప్పటివరకు తమిళనాట ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అందించిన విజయ్ తాజాగా తన 59వ చిత్రానికి సన్నద్ధమవుతున్నారు. అట్లికుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని కలైపులిథాను నిర్మించబోతున్నారు. సమంతా, అమీజాక్సన్ కథానాయికలుగా నటించనున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ