సీనియర్ నటుడు చిరంజీవి తర్వాత టాలీవుడ్‌లో నంబర్‌వన్ హీరో ఎవరనే విషయంపై కొన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. పవన్‌కల్యాన్, మహేష్, ఎన్టీఆర్,చరణ్ ఇలా ఎంతో మంది పోటీపడినా ఇప్పటికీ నంబర్‌వన్ ఎవరనేది తేలలేదు. ఇప్పుడు ఈ తాజాగా ఈ జాబితాలోకి ప్రభాస్ వచ్చి చేరాడు ‘బాహుబలి’ విడుదలై కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతుండటం.. ‘బాహుబలి’ టాలీవుడ్‌లోని పాత రికార్డులను తిరగరాస్తుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ప్రభాస్‌పై పడింది. అయితే నంబర్‌వన్ అనే స్థానం ఒక్క సినిమాతో వచ్చేయదని దానికి ఎంతో కృషి అవసరమని ప్రభాస్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో చెప్పినా ఆయన అభిమానులు మాత్రం ‘బాహుబలి’తో లెటేస్ట్ నంబర్‌వన్ ప్రభాసేనని గట్టిగా చెబుతున్నారు. అంతే కాదు ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్‌కు తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక నుంచి ప్రభాస్ తన ప్రతి సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందుతుందని ఇటీవల మీడియాతో చెప్పాడు. సో.. ఇక భవిష్యత్‌లో కూడా మా హీరోకు కమర్షియల్‌గా తిరుగులేదని, తప్పకుండా ప్రభాస్ టాలీవుడ్‌లో నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహిస్తాడని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.